Sat Dec 13 2025 19:31:10 GMT+0000 (Coordinated Universal Time)
Vandebharath : బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్
బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది

బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కలబుర్గి–బెంగళూరు వందేభారత్ మార్గంలో మార్పులు చేసింది. కలబుర్గి–. బెంగళూరు–కలబుర్గి వందేభారత్ ఎక్స్ప్రెస్కు మార్గం మార్చేందుకు రైల్వే బోర్డు అనుమతి ఇచ్చిందని దక్షిణ పశ్చిమ రైల్వే తెలిపింది. ఈ మార్పు వల్ల శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం వద్ద అదనపు స్టాప్ కల్పించారు.
జనవరి ఒకటోతేదీ నుంచి
ఈ మార్పు 2026 జనవరి 1వ తేదీ నుంచి కలబుర్గి దిశలో, జనవరి 2 నుంచి ఎస్.ఎం.వి.టి. బెంగళూరు దిశలో ఈ మార్పు అమల్లోకి వస్తుందని అధికారులు చెప్పారు. ప్రజలు, యాత్రికులు, భక్తులకు ఈ మార్గం ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. దీనివల్ల బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు ప్రయాణం మరింత సులువుగా మారనుంది. పుట్టపర్తిలో స్టాప్ కారణంగా చాలా మందికి ఉపయోగపడుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Next Story

