Sun Mar 15 2026 23:12:12 GMT+0530 (India Standard Time)
తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.

తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి నుంచి రాక్సౌల్ వెళ్లే చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ రైలును తిరుపతి వరకు పొడిగించినట్టు ప్రకటించింది. ఈ నెల చివరి నుండి ఈ రైలు తిరుపతి వరకూ ప్రయాణిస్తుందని తెలిపింది. తిరుపతి నుంచి బీహార్ లోని రాక్సౌల్ కు వారానికి ఒకసారి నడిచే ఎక్స్ ప్రెస్ రైలు ఈ నెల 27వ తేదీ నుంచి నవంబరు 29 వ తేదీ వరకూ శనివారం నుంచి తిరుపతి నుంచి బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు.
తిరుగు ప్రయాణంలో...
అలాగే తిరుగు ప్రయాణంలో రాక్సౌల్–తిరుపతి వారానికి ఒకసారి నడిచే ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 2 వరకు నడుస్తుంది. చర్లపల్లి–రాక్సౌల్ టైమింగ్స్‌లో మార్పుల్లేవని తెలిపింది. ఈ రైలు రేణిగుంట, కడప, గుంటకల్, ఆదోని, సికింద్రాబాద్, చర్లపల్లి మీదుగా రాక్సౌల్ వరకు వెళ్తుంది. చార్లపల్లి - రాక్సౌల్ మధ్య ప్రస్తుత టైమింగ్స్‌లో ఎలాంటి మార్పులుండబోవని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు. తిరుపతి నుంచి భక్తులు, దూరప్రయాణికులకు దీనివల్ల మరింత ప్రయాణం సులభమవుతుందని తెలిపింది.
Next Story

