Fri Dec 05 2025 13:19:24 GMT+0000 (Coordinated Universal Time)
అరుణాచలం వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ నుంచి అరుణాచలం ప్రతి బుధవారం సాయంత్రం 4:30 గంటలకు స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉందని తెలిపింది. అరుణాచల యాత్రకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఏపీలో ఈ స్టేషన్లకు హాల్ట్ ఉంటుందని తెలిపింది. నర్సాపూర్ - తిరువణ్ణామలై - భక్తుల కోసం స్పెషల్ రైళ్లు ప్రారంభమయ్యాయి. శ్రావణ పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని పవిత్ర అరుణాచల క్షేత్రానికి భక్తుల రాకపోకల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను నడపనుంది.
ప్రత్యేక రైలు వేళలు.. ఆగే స్థలాలు ఇవే...
జులై 9, 16, 23 తేదీల్లోనూ ఆగస్టు 6,13, 20, సెప్టంబరు 3, 24వ తేదీల్లో నర్సాపూర్ నుంచి తిరువణ్ణామలై వరకూ ప్రత్యేక రైలు ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటలకు నర్సాపూర్ లో ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 4:55 గంటలకు చేరనుంది. తిరిగి అదే ట్రెయిన్ తిరువణ్టామలై నుంచి జులై 10, 17, 24, ఆగస్టు 7, 14, 21, సెప్టంబరు 25 తేదీల్లో ప్రారంభమవుతుంది. ఉదయం పదకొండు గంటలకు అరుణాచలంలో ప్రారంభమై తెల్లవారుజామున రెండు గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. ఈరైలు పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల చిత్తూరు, కాట్పాడి, వేలూరు లో రైలు ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇప్పటికే ఈ రైలు రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమయింది.
Next Story

