Fri Sep 13 2024 08:43:34 GMT+0000 (Coordinated Universal Time)
సంక్రాంతికి మరో 30 ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి సందర్భంగా ప్రయాణకుల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది
సంక్రాంతి సందర్భంగా ప్రయాణకుల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. 30 రైళ్లను సంక్రాంతికి నడపనున్నట్లు తెలిపింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లను అన్ని ప్రాంతాలకు నడపనున్నట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు. గతంలో ఉన్న రైళ్లు యధాతధంగా కొనసాగుతాయి. అవి కాకుండా అదనంగా 30 రైళ్లను సంక్రాంతి కోసమే ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఎల్లుండి నుంచి...
జనవరి 1వ తేదీ నుంచి 20 వ తేదీ మధ్యలో ఈ 30 ప్రత్యేక రైళ్లను నడిచే విధంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్లాన్ చేసింది. వివిధ ప్రాంతాలకు రైళ్లలో సీట్లు ఇప్పటికే నిండిపోవడంతో ప్రత్యేక ట్రైన్ లను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, వికారాబాద్ నుంచి ఈ రైళ్లు బయలుదేరతాయి. నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ మార్గంలో ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. పండగ అనంతరం కూడా ఈ రైళ్లు అందుబాటులో ఉండటంతో ప్రయాణికులకు సౌకర్యంగా ఉండనుంది.
Next Story