Fri Mar 27 2026 06:40:03 GMT+0530 (India Standard Time)
డబ్బులు డ్రా చేయడంపైనే ధ్యాస
ప్రాజెక్టుల గురించి ప్రభుత్వం ఆలోచన చేయడం లేదని, డబ్బులు డ్రా చేసుకోవడంపైనే దృష్టి పెట్టిందని సోము వీర్రాజు అన్నారు.

ప్రాజెక్టుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయడం లేదని, డబ్బులు డ్రా చేసుకోవడంపైనే దృష్టి పెట్టిందని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 55 వేల కోట్ల నిధులను మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ఈ నెల 19న రాయలసీమలో ఉండే నీటి సమస్యలపై ఈ నెల 19న కడపలో బీజేపీ ధర్నా చేస్తుందని సోము వీర్రాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో గత ప్రభుత్వం చంద్రన్న బాట, ఈ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాలను నిర్మించారని సోము వీర్రాజు తెలిపారు.
కేంద్రం పథకాలను....
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద ఇచ్చిన నిధుల్లో నలభై వేల కోట్ల జగనన్న కాలనీలకు ఈ ప్రభుత్వం ఉపయోగించిందని సోము వీర్రాజు ఆరోపించారు. అవి జగనన్న కాలనీలు కాదని, మోదీ కాలనీలు అని సోము వీర్రాజు అన్నారు. వచ్చే ఎన్నికల్లో తామే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు సోము వీర్రాజు తెలిపారు.
- Tags
- somu veerraju
- bjp
Next Story

