Fri Mar 27 2026 16:56:12 GMT+0530 (India Standard Time)
తిరుపతి సభకు నేను హాజరు కాను
తిరుపతిలో అమరావతి రైతుల సభకు భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.

తిరుపతిలో అమరావతి రైతుల సభకు భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. అమరావతిలోనే రాజధాని ఉండాలన్నది బీజేపీ నిర్ణయమని చెప్పారు. రాష్ట్రమంతటా అభివృద్ధి చేయడమే బీజేపీ లక్ష్యమని సోము వీర్రాజు తెలిపారు. అభివృద్ధిని అన్ని చోట్ల చేయాలని సోము వీర్రాజు కోరారు.
కన్నా హాజరవుతారు....
తిరుపతి సభకు బీజేపీ తరుపున కన్నా లక్ష్మీనారాయణ హాజరవుతారని సోము వీర్రాజు తెలిపారు. బహిరంగ సభలో బీజేపీ స్టాండ్ ను మరోసారి తెలియజేస్తారన్నారు. అమరావతి రైతులకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
- Tags
- somu veerraju
- bjp
Next Story

