Thu Mar 19 2026 11:33:39 GMT+0530 (India Standard Time)
చంద్రబాబుతో కలిసే ప్రసక్తి లేదు
కుటుంబ పార్టీలు దోపిడీ పార్టీలేనని బీజేపీచీఫ్ సోము వీర్రాజు అన్నారు. చంద్రబాబుతో తాము కలిసే ప్రసక్తి లేదని చెప్పారు

కుటుంబ పార్టీలు దోపిడీ పార్టీలేనని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. చంద్రబాబుతో తాము కలిసే ప్రసక్తి లేదని చెప్పారు. పాదయాత్ర చేసి లక్ష సమస్యలతో ఈ ప్రభుత్వంపై ఛార్జిషీటు వేస్తామని తెలిపారు. గతంలో చంద్రబాబు పాలించారని, ఇప్పుడు వైఎస్ జగన్, అంతకు ముందు వాళ్ల తండ్రి రాష్ట్రాన్ని పాలించినా సమస్యలు మాత్రం పరిష్కరించలేదన్నారు.
ప్రత్యేక హోదా అంశంపై...
తాము అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇప్పటికే పదిహేను వందల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని మరిన్ని నిధులను కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని సోము వీర్రాజు తెలిపారు. ప్రత్యేక హోదా అంశం ఇంకా ముగియలేదని సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Next Story

