Sat Dec 06 2025 16:25:48 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి మోసం చేసేందుకే జగన్...?
అధికార వికేంద్రీకరణ పేరిట మరోసారి ప్రజలను జగన్ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని సోము వీర్రాజు అన్నారు.

అధికార వికేంద్రీకరణ పేరిట మరోసారి ప్రజలను జగన్ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాజధానిని అమరావతిలో కొనసాగించాలని కోరుతున్నా, పట్టించుకోకుండా జగన్ మరోసారి అధికార వికేంద్రీకరణ పేరిట ముందుకు వస్తున్నారన్నారు.
వీగిపోతాయనే.....
రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ జరుగుతుందని, తుది దశకు చేరుకుని తీర్పు వచ్చే సమయంలో జగన్ చట్టాలను రద్దు చేశారని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు తమ డిక్లరేషన్ లో ఉందని, రాయలసీమ డిక్లరేషన్ కు తమ పార్టీ కట్టబడి ఉందని సోము వీర్రాజు చెప్పారు. రాజధానుల విషయాన్ని ప్రస్తావించకుండా మూడింటిని చేయడానికి జగన్ రెడీ అయ్యారని సోము వీర్రాజు అన్నారు.
- Tags
- somu veerraju
- bjp
Next Story

