Sun Mar 08 2026 03:14:14 GMT+0530 (India Standard Time)
ఈరోజైనా జగన్ ఉచితం ఇవ్వరాదా?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన పుట్టినరోజు నాడయినా ఇసుకను ఉచితంగా ఇవ్వాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన పుట్టినరోజు నాడయినా ఇసుకను ఉచితంగా ఇవ్వాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. ఇసుక విధానంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇసుకను టన్ను 900 రూపాయలకు అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. మార్కాపురంలో టన్ను ఇసుక పన్నెండు వందలకు అమ్మడం జగన్ కు కన్పించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు.
అడ్డగోలు దోపిడీ....
జేసీ కంపెనీకి రాష్ట్రంలో ఇసుకను ధారాదత్తం చేశారని, ఆ సంస్థ ప్రజలను అడ్డంగా దోచుకుంటుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఇరిగేషన్ శాఖ డ్రెడ్జింగ్ చేస్తుంటే ఆ సంస్థ ప్రజలకు విక్రయిస్తూ లాభాలను గడిస్తుందని తెలిపారు. లారీ ఇసుకను లక్ష రూపాయలకు అమ్ముకుంటున్నారని, పుట్టినరోజు నాడైనా ఇసుకను జగన్ ఉచితంగా ప్రజలకు సరఫరా చేస్తే బాగుంటుందని సూచించారు.
Next Story

