Sat Mar 07 2026 20:28:14 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు రోడ్ షోపై రాళ్లు
నందిగామలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రోడ్ షోపై కొందరు గుర్తుతెలియని వ్యక్తి రాయి విసిరారు

నందిగామలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రోడ్ షోపై కొందరు గుర్తుతెలియని వ్యక్తి రాయి విసిరారు. ఈ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ మధుకు గాయాలయ్యాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయిన సమయంలో ఈ రాయి విసిరినట్లు పోలీసులు గుర్తించారు.
సీఎస్ఓకు గాయాలు...
పోలీసుల భద్రతా వైఫల్యం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీీపీ రౌడీలకు తాను భయపడబోనని ఆయన తెలిపారు. గాయాలపాలైన మధును సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైసీపీ నేతలు తమకు భయపడి ఇలాంటి చర్యలకు దిగుతున్నారని చంద్రబాబు మండి పడ్డారు.
Next Story

