Fri Dec 05 2025 13:38:04 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : బెజవాడలో శాతవాహన కళాశాల కూల్చివేత
విజయవాడలో శాతవాహన కళాశాలను కూల్చివేస్తున్నారు.

విజయవాడలో శాతవాహన కళాశాలను కూల్చివేస్తున్నారు. కొందరు వ్యక్తులు వచ్చిన కళాశాల భవనాలను కూల్చివేస్తున్నారు. విజయవాడలో శాతవాహన కళాశాల అత్యంత ప్రాముఖ్యత కలిగినది. అయితే గత కొంత కాలంగా కళాశాల యాజమాన్యం లో విభేదాలు తలెత్తాయి. ఇది కొంత ఇబ్బందికరంగా మారింది. అయితే పోలీసులు కూల్చివేతలను అడ్డుకుంటున్నారు. కూల్చివేతలకు సంబంధించిన సిబ్బందిని అదుపులో పోలీసులు తీసుకుని ప్రశ్నిస్తున్నారు. జేసీబీలతో వచ్చి భవనాలను కూల్చివేవారు.
విద్యార్థులకు చెందిన...
ఇటీవల విజయవాడలో శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ ను కొందరు కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్ కేసుల విషయంలో ఒక అధికార పార్టీకి చెందిన ప్రముఖుని పేరు బయటకు వచ్చింది. అయితే విజయవాడలో శాతవాహన కళాశాలను కూల్చి వేసి బోయపాటి శ్రీనివాస్ అప్పారావు పేరిట బోర్డులను ఆ స్థలంలో పెట్టారు. శిధిలాల కింద విద్యార్థులకు సంబంధించిన రికార్డులున్నాయని చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం తమకు కోర్టు ఉత్తర్వులు అందలేని చెబుతున్నారు. తాము పోలీసులకు ముందుగానే చెప్పామని బోయపాటి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Next Story

