Mon Dec 09 2024 10:21:57 GMT+0000 (Coordinated Universal Time)
వివాదంలో ఏపీ సచివాలయం ఉద్యోగులు
ఏపీ సచివాలయ ఉద్యోగులు కొందరు వివాదంలో చిక్కుకుకున్నారు
ఏపీ సచివాలయ ఉద్యోగులు కొందరు వివాదంలో చిక్కుకుకున్నారు. అనుమతులు లేకుండా మద్యం పార్టీ చేసుకున్న పలువురు ఉద్యోగుల పై ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఏపీ సచివాలయ డైరెక్టర్ పోస్ట్ జరగ బోయే ఎన్నికల్లో గెలిచేందుకు ఈ పార్టీ జరిగినట్టు సమాచారం, ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామ్ రెడ్డి ని పోలీసులు అదుపులో కి తీసుకున్నట్టు సమాచారం, తాడేపల్లి లోని ఒక గార్డెన్ లో ఈ విందు జరిగినట్టు సమాచారం.
కీలక నేత అరెస్ట్...
ఈ కేసుకు సంబంధించి ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి అరెస్టు చేసినట్లు సమాచారం. ఏపీ సచివాలయ క్యాంటిన్ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి ప్రలోభాలు గురిచేస్తున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు ఉద్యోగులను ప్రలోభపెట్టేందుకు మందు, విందు పార్టీలు ఏర్పాటు చేశారని పేర్కొంటున్నారు. నిన్న అర్ధరాత్రి వెంకట్రామిరెడ్డిని ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసినట్లు తెలిసింది.
Next Story