Wed Dec 17 2025 06:46:34 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ సమీక్షకు మంత్రులు డుమ్మా
వైసీపీ అధినేత జగన్ గడప గడపకు ప్రభుత్వం సమీక్షకు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో తనను వారం రోజుల నుంచి కలసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సూచించారు. ఇంటి వద్దే ఉండి చికిత్స పొందుతున్నానని తెలిపారు. ఈరోజు జరుగుతున్న గడప గడపకు ప్రభుత్వం సమీక్షకు కూడా కరోనా సోకడం వల్లనే హాజరు కాలేకపోయానని బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తెలిపారు.
బుగ్గనకు కరోనా...
అయితే ఈ భేటీకి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. మొత్తం పది మంది ఎమ్మెల్యేల వరకూ గైర్హాజరయ్యారని తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్లనే వీరు గైర్హాజరయ్యారని చెబుతున్నారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, విడదల రజనీ తో పాటు ఎమ్మెల్యేలు ఆళ్లరామకృష్ణారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీలు కూడా హాజరు కాలేదు. దీనిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బుగ్గన మాత్రం తనకు కరోనా సోకడం వల్లనే హాజరు కాలేకపోయానని చెబుతన్నారు.
Next Story

