Fri Dec 05 2025 12:28:21 GMT+0000 (Coordinated Universal Time)
Srisailam : శ్రీశైలం జలాశయానికి వరదనీరు
శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరదనీరు చేరుతుంది.

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరదనీరు చేరుతుంది. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 15,561 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో నిల్ గా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుపూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 835.80 అడుగులు ఉంది. పూర్తి స్దాయి నీటి నిల్వ 215.7080 టీఎంసీలు కాగా ప్రస్తుతం 55.0840 టీఎంసీలు ఉంది. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాలేదు.
జూరాలకు కూడా...
ఇక జూరాల ప్రాజెక్టుకు కూడా క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. జూరాల ప్రాజెక్టు ఇన్ ఫ్లో 16 వేల 826 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 16 వేల 143 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లుండగా, ప్రస్తుత నీటిమట్టం..317.980 మీటర్లు ఉంది.ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 8.517 టీఎంసీలుగా ఉంది.
Next Story

