Tue Jan 13 2026 05:32:01 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు స్కిల్ డెవలెప్ మెంట్ కేసు క్లోజ్
చంద్రబాబుపై నమోదయిన స్కిల్ డెవలెప్ మెంట్ కేసు మూసివేశారు

గత ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసులన్నీ ఒక్కొక్కటిగా మూసివేస్తున్నారు. తాజాగా స్కిల్ డెవలెప్ మెంట్ కేసు కూడా మూసివేశారు. స్కిల్ డెవలెప్ మెంట్ కేసును ఏపీ ప్రభుత్వం మూసివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలెప్ మెంట్ కేసు నమోదయింది. చంద్రబాబు నాయుడుతో పాటు మొత్తం 37 మంది పై కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు దాదాపు యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉన్నారు.
అవకతవకలు జరిగాయన్న...
అనంతరం ఆరోగ్యం బాగాలేదన్న కారణంగా బెయిల్ పై బయటకు వచ్చారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్కిల్ డెవలెప్ మెంట్ కేసు విచారణలో సీఐడీ తుది నివేదికను సమర్పించింది. సీఐడీ తుది నివేదికలో స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో అవకతవకలు జరిగాయన్న ఆధారాలు లభించలేదని సీఐడీ అధికారులు తేల్చారు. దీంతో ఏసీబీ న్యాయస్థానం ఈ కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. దీంతో ఈ కేసులో నిందితులందరికీ ఊరట దక్కినట్లయింది.
ఆధారాలు లభించకపోవడంతో...
నిధుల దుర్వినియోగం అయినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని తేల్చడంతో ఏసీబీ న్యాయస్థానం ఈ కేసును విచారించేందుకు తిరస్కరించింది. చంద్రబాబుతో పాటు మరో 37 మంది పై నమోదయిన విచారణను ఏసీబీ న్యాయస్థానం ముగించింది. మొత్తం 371 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్లు గత ప్రభుత్వం కేసు నమోదు చేసినప్పటికీ సీఐడీ మాత్రం మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్స్ అంటూ న్యాయస్థానం కొట్టివేయడంతో చంద్రబాబుకు ఊరట లభించినట్లయింది. మరొకవైపు తుదినివేదికపై తమ వాదనలను వినాలంటూ స్కిల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చింది.
Next Story

