Mon Jan 20 2025 15:50:03 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతి రుయా ఘటన : ఆరుగురు అరెస్ట్
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసులిచ్చామని ప్రభుత్వ పెద్దలు తెలిపారు. ఆర్‌ఎంవోను సస్పెండ్..
తిరుపతి : రుయా ఆసుపత్రిలో అంబులెన్స్ మాఫియాకు చెందిన వారు కటకటాల పాలయ్యారు. పదేళ్ల బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లకుండా అడ్డుకున్న ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన అంబులెన్స్ డ్రైవర్లు నరసింహులు, క్రిష్ణమూర్తి, దొరైరాజ్, దామోదర్, ప్రభు, శేఖర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రుయా హాస్పిటల్ అంబులెన్స్ డ్రైవర్లందరూ మాఫియాలా మారి అక్రమాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో తేలడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసులిచ్చామని ప్రభుత్వ పెద్దలు తెలిపారు. ఆర్‌ఎంవోను సస్పెండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే మంత్రులు ప్రకటించారు. ఈ ఘటనపై మంత్రి రజనీని సీఎం జగన్ క్యాంపు ఆఫీసుకు పిలిచి వివరాలు తెలుసుకున్నారు. అంబులెన్స్ ధరలను నిర్దేశిస్తూ స్విమ్స్, రుయా ఆసుపత్రి వద్ద బోర్డులను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకట రమణరెడ్డి అన్నారు. నిర్దేశిత ధరల కన్నా, ఎక్కువగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పిడియాక్ట్ కేసులు పెడతామన్నారు.
Next Story