Fri Dec 19 2025 22:21:47 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు చేరుకున్న సిట్ బృందం
తిరుమలకు సిట్ బృందం చేరుకుంది సర్వశ్రేష్టి త్రిపాఠి ఆధ్వర్యంలోని బృందం తొలుత తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుంది

తిరుమలకు సిట్ బృందం చేరుకుంది. సిట్ అధికారి సర్వశ్రేష్టి త్రిపాఠి ఆధ్వర్యంలోని బృందం తొలుత తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుంది. అనంతరం లడ్డూ తయారయ్య పోటును పరిశీలించింది. అయితే తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావును కలసి కల్తీ నెయ్యిపై విచారించనుంది.
నివేదిక ఇచ్చేందుకు...
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం విచారణ చేపట్టనుంది. ప్రభుత్వానికి వీలయినంత త్వరగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇచ్చేందుకు స్సెషల్ ఇన్విస్టిగేషన్ టీం సిద్ధమవుతుంది. ఈరోజు సిట్ బృందం సమావేశమై ఏఏ అంశాలపై విచారణ జరపాలన్న దానిపై ఒక నిర్ణయానికి రానుంది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ప్రతినిధులను కూడా విచారించే అవకాశముంది.
Next Story

