Sat Dec 13 2025 19:30:01 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సిట్ ఎదుటకు వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది.

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో 24 మందిపై కేసు నమోదు చేసింది. మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిి నోటీసులు సిట్ అధికారులు జారీ చేశారు. నేడు విచారణకు హాజరు కావాలని వైవీ సుబ్బారెడ్డిని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు.
కల్తీ నెయ్యి కేసులో...
తిరుమలలో కల్తీ నెయ్యి జరిగిందని ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తుంది. ఇందులో వైవీ సుబ్బారెడ్డి పీఏను కూడా విచారించింది. అయితే ఈ కేసులో అప్పట్లో టీటీడీ ఈవో గా ఉన్న ధర్మారెడ్డి అప్రూవర్ గా మారారన్న వార్తలతో నేడు వైవీ సుబ్బారెడ్డిని విచారణ చేయనుంది. ఈ విచారణ తర్వాత కీలక విషయాలు బయటపడే అవకాశాలున్నాయని సిట్ అధికారులు చెబుతున్నారు.
Next Story

