Sun Mar 15 2026 19:23:38 GMT+0530 (India Standard Time)
ఏపీలో ఇంటర్ విద్యార్థి గుండెపోటుతో మృతి
పల్నాడు జిల్లా పసుమర్రు గ్రామానికి చెందిన షేక్ ఫిరోజ్ మంగళవారం గుండెపోటుతో మరణించాడు

చిన్నా లేదు.. పెద్దా లేదు వరసగా గుండెపోటు మరణాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. విద్యార్థులు కూడా ఒక్కసారి గుండెపోటుతో కుప్పకూలిన సంఘటనలు అనేకం వింటున్నాం. కోవిడ్ తర్వాత ఇలాంటి పరిస్థితులు వచ్చాయని వైద్యులు చెబుతున్నా, మారుతున్న అలవాట్లు కూడా ఈ గుండెపోటుకు కారణమని నిపుణులు అంటున్నారు. తాజాగా ఏపీలోని పల్నాడు జిల్లాలో ఇంటర్ విద్యార్థి గుండెపోటుతో మరణించిన సంఘటన అందరినీ కలచి వేసింది.
ఇంటర్మీడియట్ చదువుతున్న...
పల్నాడు జిల్లా పసుమర్రు గ్రామానికి చెందిన షేక్ ఫిరోజ్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అయితే మంగళవారం తెల్లవారు జామున గుండెనొప్పి వస్తుందని ఫిరోజ్ కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఫిరోజ్ చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. దీంతో ఫిరోజ్ కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story

