Mon Dec 15 2025 07:31:04 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి ఆ జిల్లా నేతలు..మార్చేస్తారా? ఏంది?
తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పలువురు వైసీపీ నేతలకు పిలుపు వచ్చింది.

తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పలువురు వైసీపీ నేతలకు పిలుపు వచ్చింది. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, నియోజకవర్గాలు రావాలంటూ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడటంతో కొత్త సమీకరణాలు చోటు చేసుకున్నందున జిల్లాలో పరిస్థితిపై క్యాంప్ కార్యాలయంలో నేతలతో చర్చించనున్నారు. రానున్న ఎన్నికల్లో కూటమిని తట్టుకునేందుకు ఎలా వ్యవహరించాలన్న దానిపై సమాలోచనలు చేయనున్నారు.
గత ఎన్నికల్లో..
గత ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 పదిహేను అసెంబ్లీ నియోజవర్గాల్లో పదమూడు స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. దీంతో ఈసారి పదికి తక్కువ కాకుండా నియోజకవర్గాలను గెలుచుకోవాలని వైసీపీ అధినాయకత్వం కసరత్తులు చేస్తుంది. కూటమికి సంబంధించి కొందరు అభ్యర్థులు ఖరారయినందున అక్కడ బలమైన అభ్యర్థులున్నారా? ప్రస్తుతమున్న వారు పోటీకి సరిపోతారా? అన్న దానిపై అధినాయకత్వం ఆరా తీయడానికే వారిని పిలిచినట్లు సమాచారం. అవసరమైతే మార్పులు చేయడానికి కూడా సిద్ధమవుతారని చెబుతున్నారు.
Next Story

