Thu Mar 19 2026 05:49:40 GMT+0530 (India Standard Time)
బస్సులో 17 లక్షల నగదు మాయం
బస్సులో ఉన్న పదిహేడు లక్షల నగదు మాయమైన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది

బస్సులో ఉన్న పదిహేడు లక్షల నగదు మాయమైన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఒక ప్రయివేటు బస్సులో ప్రయాణికుడి నగదు చోరీకి గురయింది. గుంటూరు జల్లా నరసరావుపేటకు చెందిన ఆదిబాబు పదిహేడు లక్షలతో బెంగుళూరుకు వెళుతున్నారు. తన వ్యాపారికి చెందిన నగదును బెంగుళూరుకు తీసుకెళుతున్నారు. ఒక ప్రయివేటు బస్సులో ప్రయాణిస్తున్నాడు.
టిఫిన్ చేసి వచ్చేసరికి....
అయితే తెల్లవారు జామున టిఫిన్ కోసం బస్సును ఒక ఫుడ్ ప్లాజా వద్ద ఆపారు. టిఫిన్ చేసేందుకు ఆదిబాబు తన నగడు బ్యాగను లగేజీ క్యారియర్ లో ఉంచి టిఫిన్ కు వెళ్లాడు. టిఫిన్ చేసి వచ్చే సరికి నగదు ఉన్న బ్యాగ్ కన్పించలేదు. దీనిపై పోలీసులకు ఆదిబాబు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

