Sun Mar 22 2026 19:44:18 GMT+0530 (India Standard Time)
నేడు ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ లో నేడు ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో నేడు ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులను నియమించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 10.30 గంటలకు హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
వీరి చేత....
న్యాయమూర్తులుగా కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయిన సుజాత, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, రాజశేఖర్ ల చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
- Tags
- judges
- high court
Next Story

