Thu Feb 26 2026 12:57:58 GMT+0530 (India Standard Time)
లాడ్జిలో ఘోర ప్రమాదం.. ఒకరి మృతి
కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.

కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి రాజంపేట డీప్ లాడ్జిలో అగ్నిప్రమాదం జరిగి ఒకరు మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా లాడ్జిలో భారీగా మంటలు వ్యాపించడంతో బస చేసిన వారు పొగకు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమీప ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మంటల్లో చిక్కుకుని రిసెప్షన్లో ఉన్న వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
షార్ట్ సర్క్యూట్ కారణమని..
సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. కిటికీలు, డోర్లు పగలగొట్టి 39 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. మృతి చెందిన వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమని అగ్ని మాపక శాఖ అధికారులు ప్రాధమికంగా నిర్ధారించారు. పోలీసులు అక్కడకు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు.
Next Story

