Mon Feb 02 2026 20:57:33 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పై వరుస ప్రమాదాలు.. ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్న తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పై వరుస ప్రమాదాలు జరిగాయి. ఒక ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్న తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పై వరుస ప్రమాదాలు జరిగాయి. ఒక ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఫ్లై ఓవర్ పై వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టడంతో.. దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరిలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. యువతిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణం కోల్పోయింది. మృతులు విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన సెలూన్ బాయ్ ప్రశాంత్ (22), మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని(17)గా గుర్తించారు పోలీసులు. అశీల్ మెట్ట నుంచి కంచరపాలెం వైపు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు.
మద్యం మత్తులో...
అదే ఫ్లై ఓవర్ పై మరో ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్ పై వెళ్తున్న కారును మరో కారు ఢీ కొట్టడంతో .. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. మద్యం మత్తులో ఉన్న యువకుడు కారు డ్రైవ్ చేయడంతో ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రెండు ప్రమాద ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

