Sun Mar 15 2026 08:19:52 GMT+0530 (India Standard Time)
RGV : వారం రోజుల తర్వాత వస్తా
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈరోజు మద్దిపాడు పోలీస్ స్టేషన్ కు హాజరు కాలేదు.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈరోజు మద్దిపాడు పోలీస్ స్టేషన్ కు హాజరు కాలేదు. ఆయన ఈరోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. సోషల్ మీడియాలో అనుచితమైన పోస్టులను పెట్టారంటూ టీడీపీ నేత ఒకరు మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈరోజు విచారణకు హాజరు కావాలని వర్మకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
విచారణకు హాజరు కాలేనని...
అయితే ఈరోజు రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాలేదు. తన న్యాయవాది ద్వారా మద్దిపాడు పోలీసులకు సమాచారం పంపారు. తనకు సినిమా షూటింగ్ లు ఉన్న నేపథ్యంలో వారం రోజుల పాటు తాను విచారణకు హాజరు కాలేనని, వారం రోజుల తర్వాత విచారణకు హాజరై తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతానని రామ్ గోపాల్ వర్మ పోలీసులకు సమాచారం తెలిపారు. అయితే పోలీసులు నిజంగా వర్మ షూటింగ్ లో ఉన్నారా? లేదా? అన్న సమాచారంపై ఆరా తీస్తున్నారు.
Next Story

