Mon Mar 16 2026 03:13:21 GMT+0530 (India Standard Time)
Yv Subba Reddy : ఏపీ రిజల్ట్ పై వైవీ సుబ్బారెడ్డి సంచలన కామెంట్స్ వింటే?
వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలపై సంచలన కామెంట్స్ చేశారు

వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలపై సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గతం కంటే ఎక్కువ స్థానాలను ఈసారి వైసీపీ గెలుచుకుంటుందని తెలిపారు. వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్న వైవీ సుబ్బారెడ్డి ఈసారి అంతకు మించి స్థానాలతో తమ పార్టీ అధికారం చేపట్టబోతుందని చెప్పారు.
జూన్ 9వ తేదీన...
అలాగే వైఎస్ జగన్ జూన్ 9వ తేదీన ముఖ్యమంత్రిగా జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈసారి తన ప్రమాణస్వీకారం జగన్ విశాఖలో చేస్తారని కూడా ఆయన తెలిపారు. ప్రజలు పెద్దయెత్తున అర్ధరాత్రి వరకూ వేచి ఉండి వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేయడం వల్లనే భారీ సంఖ్యలో సీట్లు సాధించబోతున్నట్లు వైవీ సుబ్బారెడ్డి జోస్యం చెప్పారు.
Next Story

