Fri Dec 05 2025 22:23:35 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ప్రభుత్వానికి చివరి రోజులే
వైసీపీ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెబుతారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు.

వైసీపీ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెబుతారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు పట్టాలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఓటిఎస్ పేరుతో ఈ ప్రభుత్వం పేదలను దోచుకునేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు. ప్రజలే వైసీపీ ప్రభుత్వానికి వన్ టైమ్ సెటిల్ మెంట్ చేస్తారని పయ్యావుల కేశవ్ జోస్యం చెప్పారు.
పెళ్లానికి మళ్లీ తాళి కట్టినట్లు....
ఓటీఎస్ పథకం పెళ్లానికి మళ్లీ తాళికట్టమని అన్నట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలో ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. కాపులను వైసీపీ ప్రభుత్వం మసం చేస్తుందని అని ఆయన అన్నారు.
Next Story

