Sun Dec 14 2025 02:03:08 GMT+0000 (Coordinated Universal Time)
నాలుకలు కోసేయండి.. పరిటాల సెన్సేషన్ కామెంట్స్
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలను దూషించిన వైసీపీ నేతల నాలుకలు కోసేయాలని ఆమె పిలుపు నిచ్చారు. రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన గౌరవ సభలో పరిటాల సునీత ప్రసంగించారు. మహిళలను కించపర్చడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. వీరి ఆగడాలకు చంద్రబాబు వంటి నేత కన్నీరు పెట్టారంటే ఎంతకు తెగించారో అర్థమవుతుందని పరిటాల సునీత అన్నారు,
వైసీపీీ ఎమ్మెల్యే....
మహిళలను కించపరుస్తూ వారిపై మాటల దాడికి దిగుతున్న వైసీపీ నేతలను ఉపేక్షించవద్దని, నాలుకలు కోసేయమని పరిటాల సునీత పిలుపు నివ్వడం సంచలనంగా మారింది. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై కూడా ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ప్రకాష్ రెడ్డి సెటిల్ మెంట్లతోనే గడుపుతున్నాడని, హైదరాబాద్ లో ఐదుకోట్లతో ఒక ఇల్లు, అనంతపురంలో ఒక ఇల్లు నిర్మిస్తున్నాడని పరిటాల సునీత ఆరోపించారు.
Next Story

