Fri Dec 05 2025 18:26:32 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే.. దూళిపాళ్ల ఫైర్
ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. ప్రజల సొమ్ముతో పెద్దయెత్తున ఖర్చు చేసి పత్రికల్లో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. దూళిపాళ్ల నరేంద్ర ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.
టీడీపీ హయాంలోనే.....
రూ.250 ల పింఛను పెంచి పెద్దయెత్తున ప్రచారం చేసుకోవడమేంటని దూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఐదు వందల నుంచి రెండు వేలకు పెంచిన విషయాన్ని దూళిపాళ్ల నరేంద్ర గుర్తు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 54 లక్షల మందికి పింఛను ఇచ్చేవారమని చెప్పారు. జగన్ పేదలకు చేసిందేమీ లేదని దూళిపాళ్ల నరేంద్ర విమర్శలు చేశారు.
Next Story

