Thu Mar 19 2026 07:59:30 GMT+0530 (India Standard Time)
కొడాలి నానికి దేవినేని వార్నింగ్
మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయి విమర్శలు చేశారు.

మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయి విమర్శలు చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన మండి పడ్డారు. తెలుగుదేశం పార్టీ గురించి కాని, చంద్రబాబు గురించి కాని మాట్లాడే నైతిక హక్కు కొడాలి నానికి లేదని ఆయన అన్నారు.
ప్రజలు తరిమికొట్టే రోజు...
కొడాలి నానిని ప్రజలు తరిమికొట్టే రోజు త్వరలోనే ఉందని దేవినేని ఉమ అన్నారు. మంత్రిగా ఉండి ప్రజలకు ఏమి చేయలేకపోగా, కిడ్నీలో రాళ్లుపడితే వైద్యం కోసం హైదరాబాద్ కు ఎందుకు పరుగులు తీశావని దేవినేని ప్రశ్నించారు. ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఉరుకోబోమని ఆయన హెచ్చరించారు.
Next Story

