Thu Mar 19 2026 07:42:55 GMT+0530 (India Standard Time)
జగన్ కు పాలన చేతకాదు.. దిగిపోతనే బెటర్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మండి పడ్డారు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మండి పడ్డారు. జగన్ కు సంపద సృష్టించడం చేతకాదని, విధ్వంసం చేయడమే తెలుసనని అన్నారు. రాష్ట్రాన్ని మరింత అప్పులుపాలు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించడం లేదన్నారు. ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లింపులు కూడా జరపలేకపోతున్నారని అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తుగ్లక్ నిర్ణయాలు...
తుగ్లక్ నిర్ణయాలతో జగన్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారన్నారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పక్కన పెట్టారన్నారు. కరోనా రెండో వేవ్ లో కరోనా క్వారంటైన్ సెంటర్ల నిర్వాహకులకు కూడా ఇంతవరకూ చెల్లింపులు చేయలేదని, మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేయలేకపోతున్నారన్నారు. ఓటీఎస్ పేరుతో ప్రజల నుంచి బలవంతపు వసూళ్లకు జగన్ పాల్పడుతున్నాడని అయ్యన్న పాత్రుడు అన్నారు. అసలే ఆర్థిక కష్టాల్లో రాష్ట్రం ఉంటే జిల్లాకో ఎయిర్ పోర్టు అంటూ చెబతున్నారని, ఆయనను ఆసుపత్రిలో చూపించాలని భారతికి అయ్యన్న పాత్రుడు సలహా ఇచ్చారు.
Next Story

