Sun Mar 15 2026 02:58:51 GMT+0530 (India Standard Time)
గవర్నర్ ప్రసంగాన్ని అందుకే అడ్డుకున్నాం
రాజ్యాంగ వ్యవస్థలను కాపాడటంలో గవర్న్ విఫలమయ్యారని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు.

రాజ్యాంగ వ్యవస్థలను కాపాడటంలో గవర్న్ విఫలమయ్యారని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. అందుకే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నామని చెప్పారు. సీఆర్డీఏ రద్దు వంటి ఫైళ్లపై గవర్నర్ ఎలా సంతకం చేస్తారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య తీవ్రంగా ఉన్నా గవర్నర్ పట్టించుకోవడం లేదన్నారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఉలుకు, పలుకు లేదన్నారు.
అరాచకాలకు....
ప్రభుత్వం అరాచకాలకు అడ్డుకట్ట వేయాల్సిన గవర్నర్ చోద్యం చూస్తున్నారని, అందుకే తాము గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నామని అచ్చెన్నాయుడు చెప్పారు. ఈ సమావేశాల్లో మొత్తం 25 అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి సరైన సమాధానం వచ్చేంత వరకూ తాము పోరాడతామని అచ్చెన్నాయుడు చెప్పారు.
- Tags
- achennaidu
- tdp
Next Story

