Thu Mar 19 2026 10:04:53 GMT+0530 (India Standard Time)
నేడు టీడీపీలో చేరనున్న కన్నా
సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ నేడు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు

సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ నేడు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం ఉంటుందని కన్నా లక్ష్మీనారాయణ అనుచరులు తెలిపారు.
అనుచరులతో కలసి...
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు టీడీపీలో చేరుతుండటంతో గుంటూరు జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. కన్నాతో పాటు దాదాపు రెండు వేల మంది ఆయన అనుచరులు కూడా పార్టీలో చేరతారని చెబుతున్నారు.
Next Story

