Sun Mar 15 2026 09:39:44 GMT+0530 (India Standard Time)
సజ్జల చేసిన పాపాలివే - డొక్కా మాణిక్యవర ప్రసాద్
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై సీనియర్ నేత డొక్కా మాణిక్యవర ప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై సీనియర్ నేత డొక్కా మాణిక్యవర ప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డితో తాను నాలుగేళ్లు కలసి ఉన్నానని అన్నారు. ఆయన నాటి ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులతో దుర్మార్గపు పనులు చేయించారని డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆరోపించారు. తనను కూడా కొన్ని దుర్మార్గపు పనులు చేయమన్నా అందుకు తాను అంగీకరించలేదన్నార. అవి ఏంటన్నది మాత్రం దేవుడి సన్నిధిలోనే చెబుతానని డొక్కా మాణిక్యవర ప్రసాద్ తెలిపారు.
నాలుగేళ్లలో ఏం జరిగిందో?
తాడేపల్లి ప్యాలెస్ లో గత నాలుగేళ్లలో ఏం జరిగిందో తనకు తెలుసునని డొక్కా మాణిక్యవర ప్రసాద్ మీడియాతో అన్నారు. కిరాయి కోసం ఎంతకైనా తెగిస్తారని ముంబయి నటి వివాదమే ఉదాహరణ అని డొక్కా అన్నారు. అలాంటి వారికి తిరుమలలో లడ్డూను కల్తీ చేయడం ఒక లెక్కా అంటూ ఎద్దేవా చేశారు. సజ్జల వస్తే తాను చేసే ఆరోపణలకు కట్టుబడుతూ తిరుమలలోనూ, లేదా వెంకటపాలెంలోని వెంకన్న ఆలయంలోనూ ప్రమాణం చేస్తానని డొక్కా మాణిక్యవర ప్రసాద్ సవాల్ చేశారు.
Next Story

