Sat Mar 14 2026 20:25:28 GMT+0530 (India Standard Time)
జగన్ ఓటమి ఖాయం.. డీఎల్ జోస్యం
వైఎస్ జగన్ పై మరోసారి సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాట తప్పడని ఎవరన్నారని ప్రశ్నించారు.

వైఎస్ జగన్ పై మరోసారి సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాట తప్పడని ఎవరన్నారని ఆయన ప్రశ్నించారు. జగన్ పాదయాత్రలో చేసిన హామీల్లో చాలా వరకూ మాట తప్పినవేనని ఆయన స్పష్టం చేశారు. సీపీఎన్ ను రద్దు చేస్తానని చెప్పిన జగన్ ఎందుకు చేయలేదన్నారు. రాజస్థాన్, ఛత్తీస్ఘడ్ లలో సీీపీఎస్ రద్దు ఎలా సాధ్యమయిందని డీఎల్ రవీంద్రారెడ్డి ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ ను మరింత దిగజార్చే విధంగా మాట్లాడారన్నారు. జగన్ అవగాహన లేక హామీ ఇచ్చారని చెప్పడం ఎంతవరకూ సబబని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ ఓటమి ఖాయమని చెప్పారు.
వివేకా హత్య కేసులో...
గత ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామాను జగన్ బాగా సొమ్ము చేసుకున్నారన్నారు. వైఎస్ వివేకా హత్య కూడా గత ఎన్నికల్లో జగన్ కు బాగా కలసి వచ్చిందని చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తుందన్నారు. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి ఖచ్చితంగా శిక్షపడుతుందని డీఎల్ రవీంద్రారెడ్డి జోస్యం చెప్పారు.
Next Story

