Mon Dec 15 2025 20:23:40 GMT+0000 (Coordinated Universal Time)
నేడు చంద్రబాబును కలవనున్న దాడి
వైసీీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత దాడి వీరభద్రరావు నేడు చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు.

YCP Ex-Minister Dadi Veerabhadra Rao
వైసీీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత దాడి వీరభద్రరావు నేడు చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నాయి. అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం టిక్కెట్ కోసం ప్రయత్నించిన దాడి కుటుంబ సభ్యులు అది దక్కదని తెలిసి ముందుగానే పార్టీకి రాజీనామా చేశారు.
రాజకీయ భవిష్యత్ పై...
అయితే చంద్రబాబును కలసి తన రాజకీయ భవిష్యత్ తో పాటు కుమారుల భవిష్యత్ గురించి కూడా చర్చిస్తారని చెబుతున్నారు. ఈరోజే దాడి వీరభద్రరావు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరే అవకాశాలున్నాయి. అయితే చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ లభిస్తుందన్న టెన్షన్ దాడి అనుచరుల్లో నెలకొని ఉంది.
Next Story

