Sat May 18 2024 23:12:23 GMT+0000 (Coordinated Universal Time)
జగనన్నా.. పెగాసస్ కొనలేదన్నా
పెగాసిస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసిన అంశంపై సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు స్పందించారు
పెగాసిస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసిన అంశంపై సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు స్పందించారు. చంద్రబాబు హయాంలో పెగాసిస్ ను కొనుగోలు చేసిందని ఒకవర్గం మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారని అయ్యన్న మండిపడ్డారు. అయితే ఏపీ ప్రభుత్వం పెగాసిస్ ను కొనుగోలు చేయలేని అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేసిన విషయాన్ని అయ్యన్నపాత్రుడు గుర్తు చేశారు.
రైట్ టు ఇన్ఫర్మేషన్....
సమాచార హక్కు చట్టం కింద నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు గత ఏడాది ఆగస్టు 12వ తేదీన గౌతమ్ సవాంగ్ సమాధానం ఇచ్చారని అయ్యన్న పాత్రుడు తెలిపారు. జగన్ వర్గం మీడియా చేస్తున్న అసత్య ప్రచారాన్ని సమాచార హక్కు చట్టమే బయటపెట్టిందని అయ్యన్న పాత్రుడు అన్నారు.
Next Story