Fri Dec 05 2025 20:13:04 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి ఆనం "మాఫియా" కామెంట్స్
సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు

సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. లోకల్ మాఫియా చెలరేగిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గిందని, కానీ లోకల్ మాఫియా మాత్రం విపరీతంగా పెరిగిందని అన్నారు. ఈ మాఫియాలకు పోలీసుల సహకారం కూడా లభిస్తుందని ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.
పోలీసు వ్యవస్థ.....
ఈ మాఫియాలు ఇప్పుడే కాదని, గత ప్రభుత్వంలోనూ ఉన్నాయని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. సామాన్యులకు పోలీసుల వద్ద న్యాయం దొరకలేని పరిస్థితి నెలకొందని ఉన్నారు. ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం క్రమంగా సన్నగిల్లుతుందని ఆయన అన్నారు. వ్యవస్థలను బలోపేతం చేయాలంటే కలుపుమొక్కలను ఏరిపారేయాల్సిందేనని ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.
Next Story

