Tue Feb 24 2026 15:48:32 GMT+0530 (India Standard Time)
ఎస్టీగా పుట్టడమే నా నేరమా?
సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు

సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీగా పుట్టడమే తాను చేసిన నేరమా..? అంటూ ఆవేదన చెందారు. ఎక్స్ లో ఆయన తన స్పందనను తెలియజేశారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని సునీల్ నాయక్ ఆరోపించారు.మాజీ సీఎం జగన్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కు వ్యతిరేకంగా చెప్పకపోతే నేరస్థుడిగా మారుతావని రఘురామరాజు తనను బెదిరించాడని తెలిపారు.
కాల్ డేటా బయటకు తీస్తే...
రఘురామరాజు కాల్ డేటా బయటకు తీస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అధికారి పీవీ సునీల్ రిటైర్ అయ్యే వరకు ఆయనపై సస్పెన్షన్ కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తనను వేధించడం సరికాదని సునీల్ నాయక్ అన్నారు.
Next Story

