Sun Feb 01 2026 08:47:31 GMT+0000 (Coordinated Universal Time)
ట్రాఫిక్ లో చిక్కుకున్న ఐఏఎస్.. లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి సన్మానం
గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు

గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరుగుతుండటంతో ట్రాఫిక్ లో చిక్కుకున్న ప్రవీణ్ ప్రకాష్ దాదాపు గంటకు పైగా అక్కడే ఉన్నారు. విమానాశ్రయం నుంచి ఇంటికి వస్తుండగా ఆయన కారుట్రాఫిక్ లో చిక్కుకుంది. ప్రవీణ్ ప్రకాష్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేషీలో పనిచేశారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గా కూడా పనిచేశారు.
విజయవాడ విమానాశ్రయం వద్ద...
చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయంలో విజయవాడ విమానశ్రయం వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ లో గంటకు పైగా ఇరుక్కుపోవడంతోప్రవీణ్ ప్రకాశ్ ని తన ద్విచక్ర వాహనంపై లిప్ట్ ఇచ్చి ఒక యువకుడు ఇంటికి చేర్చాడు. లిఫ్ట్ ఇచ్చిన గుంటూరు జిల్లా కు జిల్లాకు చెందిన సత్యం . దాదాపు ఇరవై అయిదు కిలోమీటర్ల దూరం బైక్ పైనే ప్రయాణించిన ప్రవీణ్ ప్రకాశ్ ఇంటికి చేరిన తరువాత సత్యంను శాలువాతో సత్కరించారు.
Next Story

