Thu Mar 19 2026 00:17:25 GMT+0530 (India Standard Time)
ఎవరు ఏంటో తెలుసుకుంటే మంచిది
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని సీపీఐ సీనియర్ నేత నారాయణ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని సీపీఐ సీనియర్ నేత నారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేంంత వరకూ జరిగే పోరాటంలో తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. ఉద్యోగ సంఘాలను స్వార్థం కోసం ఎవరు ఉపయోగించుకుంటున్నారో? ఎవరు వారి కోసం పాటు పడుతున్నారో తెలుసుకోవాలని నారాయణ కోరారు.
తమ మద్దతు.....
హక్కుల కోసం ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటి పైకి రావడం మంచిదేనని, అయితే తమ డిమాండ్లను సాధించుకునేంత వరకూ పోరాటాన్ని కొనసాగించాలని కోరారు. కార్మిక వర్గాలకు సీపీఐ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఉద్యోగుల పోరాటానికి కూడా తమ మద్దతు ఉంటుందని నారాయణ ఒక వీడియో ద్వారా తెలిపారు.
Next Story

