Mon Mar 16 2026 09:38:59 GMT+0530 (India Standard Time)
జగన్ కు కైకాల లేఖ
అనారోగ్యం పాలయిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అనారోగ్యం పాలయిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన ఆరోగ్యం పట్ల జగన్ చూపిన శ్రద్ధకు కైకాల జగన్ కు ధన్యావాదాలు తెలిపారు. ఈ మేరకు జగన్ కు లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నా తనకు వ్యక్తిగతంగా కాల్ చేసి సాయం అది్తామని హామీ ఇవ్వడం పట్ల కైకాల సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ ఉన్నాతాధికారులు వ్యక్తిగతంగా హాజరై తన వైద్య ఖర్చులను చెల్లించి అన్ని రకాలు సాయం అందించారని కైకాల సత్యనారాయణ తెలిపారు.
చూపిన శ్రద్థకు....
కళాకారుల పట్ల జగన్ చూపిన శ్రద్ధను కైకాల సత్యనారాయణ కొనియాడారు. ప్రజల పట్ల మీరు చూపిన శ్రద్ధ రాష్ట్రం మంచి చేతుల్లో ఉందనే భరోసా ఇస్తుందని కైకాల సత్యనారాయణ తన లేఖలో పేర్కొన్నారు. తాను తిరిగి మామూలు మనిషిని కావడానికి మీ సాయంతో పాటు అభిమానుల ప్రార్థనలని ఆయన లేఖలో తెలిపారు.
Next Story

