Sat Dec 06 2025 02:10:44 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో హై అలర్ట్
తిరుమలలో భద్రతాధికారులు హై అలర్ట్ ప్రకటించారు. తిరుమలలో టెరరిస్ట్ సంచారం ఉన్నట్లు పోలీసులకు మెయిల్ అందింది

తిరుమలలో భద్రతాధికారులు హై అలర్ట్ ప్రకటించారు. తిరుమలలో టెరరిస్ట్ సంచారం ఉన్నట్లు పోలీసులకు మెయిల్ ద్వారా సమాచారం అందింది. దీంతో తిరుమలలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని ప్రాంతాలలో తనిఖీలు ప్రారంభించారు. అనుమానం ఉన్న ప్రాంతాల్లో సోదాలను నిర్వహిస్తున్నారు.
ఫేక్ న్యూస్ అని...
గుర్తుతెలియని వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం తెలియజేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా సిబ్బంది సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలన చేస్తున్నారు. తిరుమలలో టెరరిస్ట్ సంచారం ఉన్నట్లు వచ్చిన సమాచారం రూమర్ అని, మెయిల్ ద్వారా వచ్చింది ఫేక్ న్యూస్, వాటిని నమ్మకండి.. ఎవరో కావాలని మెయిల్ పంపినట్టు అనుమానిస్తున్నామని భద్రతా సిబ్బంది చెబుతున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
Next Story

