Thu Mar 19 2026 05:27:21 GMT+0530 (India Standard Time)
Ys Jagan : తాడేపల్లిలో జగన్ ఇంటికి ప్రయివేటు సెక్యూరిటీ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి సెక్యూరిటీని పెంచారు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి సెక్యూరిటీని పెంచారు. ఆ పార్టీయే తమకు సొంతంగా భద్రత ఏర్పాట్లు చేసుకుంటుంది. జగన్ తాడేపల్లి నివాసానికి వెళ్లే రోడ్డు తెరవడంతో పాటు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో జగన్ భద్రత పట్ల పార్టీ కొన్ని చర్యలు తీసుకుంది.
భద్రత కోసం...
ఇందులో భాగంగా జగన్ ఇంటి భద్రతను ఒక ప్రయివేటు సెక్యూరిటీకి అప్పగించింది. దాదాపు ముప్పయి మంది ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బంది అనుక్షణం కాపలా ఉండేలా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంది. ఈరోజు నుంచే భద్రత చర్యలు ప్రారంభమయ్యాయి. సెక్యురిటీ సిబ్బంది జగన్ ఇంటికి చేరుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Next Story

