Fri Dec 05 2025 11:25:29 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో రెండో రోజు జిల్లా కలెకర్ల సమావేశం ప్రారంభమయింది.

ఆంధ్రప్రదేశ్ లో రెండో రోజు జిల్లా కలెకర్ల సమావేశం ప్రారంభమయింది. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో స్వచ్ఛాంధ్ర, అటవీ, మున్సిపల్, పంచాయితీరాజ్ తదితర శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల కోసం కార్పోరేషన్ ద్వారా నిధులు కేటాయిస్తున్నామన్నారు. స్వచ్ఛభారత్ కోసం ఏ జిల్లాలో అయినా పైలట్ ప్రాజెక్టుగా కార్యక్రమాలు చేపడితే అది రాష్ట్రమంతా వర్తింప చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మలు మన సంస్కతీ సంప్రదాయం, ఆ వృక్షాలు పెంచడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు ఎన్ఆర్ఈజీఎస్ కింద ఘన వ్యర్ధాల షెడ్లు నిర్మాణానికి కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో...
గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో వెదురుతో చేసే ఉత్పత్తుల కోసం ఓ కార్యక్రమాన్ని రూపోందించాలని ఆదేశించారరు. వెదురు ఉత్పత్తులు చేసేవారికి వెదురును సరఫరా చేసేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు చేతివృత్తులు, కులవృత్తులు దెబ్బతినకుండా కాపాడాలన్న చంద్రబాబు సీసీ రోడ్ల నిర్మాణం సమయంలో కాలువల కోసం మళ్లీ తవ్వకుండా పైపులైన్లు పెట్టేలా ఎస్ఓపీ చేయాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో రూఅర్బన్ సౌకర్యాలతో మోడల్ పంచాయితీలుగా తీర్చిదిద్దాలని కోరార. రూరల్ ఏరియా అర్బన్ సౌకర్యాలతో ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ ను ఓ ఉద్యమంగా రాష్ట్రంలో చేస్తున్నామని, సింగపూర్ విధానాలను పరిశీలించి ఉమ్మడి రాష్ట్రంలో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
Next Story

