Sat Apr 01 2023 23:59:08 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడలో రెండో రోజూ ఈడీ తనిఖీలు
విజయవాడలో రెండో రోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.

విజయవాడలో రెండో రోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా అక్కినేని ఉమెన్స్ ఆసుప్రతిలో ఈడీ తనిఖీలను నిర్వహిస్తుంది. ఇప్పటి వరకూ ఈడీ 40 మందికి నోటీసులు జారీ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల అదుపులో ఎన్నారై అక్కినేని ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు. కోవిడ్ సమయంలో అవకతవకలు పాల్పడినట్లు ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు.
నిధులను...
ఎన్నారై ఆసుపత్రి నిధులను అక్కినేని ఆసుపత్రికి ఉపయోంచారని అనుమానం. రికార్డులన్నీ స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. అలాగే భవనం నిర్మించడానికి 43 కోట్ల రూపాయలు వినియోగించినట్లుగా చూపి, భవనం నిర్మించకుండానే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
- Tags
- raids
- vijayawada
Next Story