Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ .. పెరుగుతున్న మరణాలు..లక్షణాలివే
ఆంధ్రప్రదేశ్ లో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం రేపుతుంది

ఆంధ్రప్రదేశ్ లో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం రేపుతుంది. ఈ వ్యాధితో మరణాలు సంభవిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. గుంటూరు, ప్రకాశం, విజయనగరం, చిత్తూరు వంటి జిల్లాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. వ్యాధిని వెంటనే గుర్తించి సరైన చికిత్స సరైన సమయంలో అందుకుంటే ప్రాణాపాయం తప్పుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారక. స్క్రబ్ టైఫస్ అనేది ఓరియంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. ఇది చిన్న పురుగులు కుట్టడం ద్వారా సోకుతుంది. ఈ వ్యాధి సోకితే జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, దద్దుర్లు, మరియు కాటు వేసిన చోట నల్లటి పుండు వంటి లక్షణాలు కనిపిస్తాయి, సరైన సమయంలో చికిత్స చేయకపోతే ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. నిన్న గుంటూరు జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఒకరు స్క్రబ్ టైఫస్ వ్యాధితో మరణించారు. రాష్ట్రంలో 1,564 కేసులు నమోదయ్యాయి. పేడ పురుగు వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది.

