Fri Dec 05 2025 13:57:10 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో స్క్రబ్ టైఫస్' కేసులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి

ఆంధ్రప్రదేశ్ లో స్క్రబ్ టైఫస్' కేసులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. విజయనగరం, పల్నాడు జిల్లాల్లో వ్యాధి లక్షణాలతో ముగ్గురు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 736 కేసులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా అనధికారికంగా మరిన్ని కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కీటకాల తాకిడి ఆగస్టు-ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
రాత్రివేళల్లోనే ఎక్కువగా...
ఆంధ్రప్రదేశ్ లో స్క్రబ్ టైఫస్ పురుగు చెట్లు, వ్యవసాయ భూములు పక్కనే నివసించే వారిపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ పురుగు రాత్రి వేళల్లో మనుషులను కుడుతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. తడి నేలలు, పొలం పనులకు వెళ్లేవారు రబ్బరు బూట్లు ధరించాలని, పిల్లలకు కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు వేయాలని చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి మరణాలకు దారి తీయదని తెలిపారు.
Next Story

