Thu Jan 29 2026 00:51:11 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు, రేపు పాఠశాలలకు సెలవు
ఆంధ్రప్రదేశ్ లో నేడు, రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ లో నేడు, రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. కర్నూలు, నంద్యాల జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రేపు ప్రధాని నరేంద్ర పర్యటన సందర్భంగా స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. నేడు, రేపు ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు తెరవకూడదని ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రధాని పర్యటన సందర్భంగా...
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా కర్నూలులో రోడ్ షోతో పాటు నంద్యాల జిల్లాలో భారీ బహిరంగ సభ ఉండటంతో పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. FA-2 పరీక్షలు 17, 18న నిర్వహించుకోవాలని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లుండి నుంచి విద్యాసంస్థలు యధాతధంగా నడుస్తాయి.
Next Story

