Wed Mar 18 2026 03:15:11 GMT+0530 (India Standard Time)
ఈ జిల్లాల్లో నేడు పాఠశాలలకు సెలవులు
భారీ వర్షాలకు నేడు ఆంధ్రప్రదేశ్ లో అనేక జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

భారీ వర్షాలకు నేడు ఆంధ్రప్రదేశ్ లో అనేక జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాఠశాలలకు సెలవులు అధికారులు ఇచ్చారు. కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రయివేటు స్కూళ్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు భారీ స్థాయిలో వర్షపాతం నమోదవుతుండటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు.
విద్యార్థులకు మాత్రమే...
అయితే విద్యార్థులకు మాత్రమే సెలవులు ప్రకటించామని, ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది యధావిధిగా హాజరు కావాలని అధికారులను ఆదేశించారు. అలాగే అల్లూరి సీతారామ జిల్లా, అనకాపల్లి, విశాఖ జిల్లాలోనూ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. బంగాళాఖాతంలో నేడు వాయుగుండం తీరం దాటే అవకాశమున్నందున పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
Next Story

